తెలంగాణ వాటర్ పోలోజట్టు కెప్టెన్‌గా అనిరుధ్
52వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్
ఇండోర్‌లో సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు పోటీలు
హైదరాబాద్, సెప్టెంబర్ 3: 52వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్ 2026(Junior National Aquatic Championship)లో వాటర్ పోలో విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్న జట్టును ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా ఐడీఏ సెప్టెంబర్ 7 నుంచి 12వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. లింగమనేని అనిరుధ్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
కొంత కాలంగా వాటర్ పోలో పోటీల్లో అనిరుధ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తెలంగాణ వాటర్ పోలో జట్టులో మొత్తం 15 మంది క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు. తెలంగాణ జట్టు జాతీ య స్థాయి పోటీల్లో ప్రతి భ కనబరిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ పోటీల్లో తెలంగాణ జ ట్టు మంచి ప్రదర్శన కనబరుస్తుందని తెలంగాణ స్విమ్మింగ్ అసోసి యేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, సెక్రెటరీ జి ఉమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ వాటర్ పోలో జట్టు :
ఎల్. అనిరుధ్ ( కెప్టెన్), అరవింద్ రేషమ్, బి. అక్షజ్, బండ్ల అద్వైత్, కటుకోజ్వాల భువన్, మద్ది మోహన్ దుర్గ, మధునాల అభినవ్, ఎండీ అజాన్, మహ్మద్ అబ్దుర్ ర హ్మాన్ సిద్ధిఖీ, సోమాన్షు బాసా, ప్రదివ్ కడాలి, శ్రేయస్ మాధవరమ్, శ్రేయస్ రెడ్డి గాలి, అఖిల్, ఎస్ కంకణాల.






