4 September, 2026 | 7:15 AM

కిదాంబి శ్రీకాంత్ సంచలనం

04-09-2026 | 05:30am

9వ ర్యాంకర్ విక్టర్‌కు షాక్

క్వార్టర్ ఫైనల్‌లో తెలుగు తేజం

చైనా మాస్టర్స్ టోర్నీ

బీజింగ్, సెప్టెంబర్ 3: చైనా మాస్టర్స్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్(Indian star shuttler Kidambi Srikanth) సంచలన విజ యం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. షెన్జెన్ వేదికగా జరిగిన పురుషుల సిం గిల్స్ ప్రి-క్వార్టర్ ఫైనల్స్ (రౌండ్ ఆఫ్ 16) మ్యాచ్‌లో ప్రపంచ 9వ ర్యాంకర్, కెనడా ఆ టగాడు విక్టర్ లాయ్‌ను శ్రీకాంత్ మట్టికరిపించారు.

ప్రపంచ 34వ ర్యాంకులో ఉన్న శ్రీకాంత్, కేవలం 43 నిమిషాల పాటు సా గిన హోరాహోరీ పోరులో 21 21 తేడాతో వరుస గేముల్లో విజయం సాధించాడు. తొలి రౌండ్‌లో భారత్‌కు చెందిన లక్ష్య సేన్‌ను ఓడించిన విక్టర్ లాయ్‌పై, శ్రీ కాంత్ తన అద్భుతమైన నెట్ ప్లే, పాతకాలపు క్లాసిక్ ప్రదర్శనతో ప్రతీకారం తీర్చుకు న్నారు. ఈ సీజన్‌లో శ్రీకాంత్‌కు ఇదే అత్యుత్తమ విజయం. తొలి గేంలో ఒకానొక దశ లో 11- వెనుకబడినప్పటికీ, శ్రీకాంత్ అద్భుతంగా పుంజుకుని ఆ గేంను 21 కైవసం చేసుకున్నాడు.

రెండో గేంలో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. 18 వెనుకబడిన సమయంలో వరుసగా 3 పాయిం ట్లు సాధించి 21- మ్యాచ్‌ను ముగించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో హాంకాంగ్‌కు చెంది న లీ చెయుక్ యియుతో శ్రీకాంత్ తలపడనున్నాడు. బీడబ్ల్యూఎఫ్ సూపర్ 750 లేదా అంతకంటే హయ్యర్ ఈవెంట్‌లో దాదాపు 1175 రోజుల తర్వాత శ్రీకాంత్ తొలిసారి క్వా ర్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఒకప్పటి ప్రపంచ నంబర్ వన్ శ్రీకాంత్ ప్రస్తుతం 34వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.