జిల్లా అట్రాసిటీ కమిటీ చైర్మన్‌గా అంజయ్య
12-01-2026 12:00 AM
బోథ్, జనవరి 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ఆదిలాబాద్ జిల్లా అట్రాసిటీ కమిటీ చైర్మన్ గా బోథ్ మండలం పిప్పల్దరి కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్యాల అంజయ్య ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, వైస్ చైర్మన్ డబ్బేట రమేష్ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రయ్య నియామక పత్రం అందించారు. చైర్మన్‌గా నియమించినందుకు మల్యాల అంజయ్య కాంగ్రెస్ దళిత విభాగం పెద్దలకు ధన్యవాదములు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి భాద్యతలు అప్పగించినందుకు ఆ పదవికి న్యాయం చేకూరుస్తానని తెలిపారు.






