25 February, 2026 | 9:50 PM

రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం సునీత మృతి

09-11-2025 09:38 PM

కొమురవెల్లి (విజయక్రాంతి): లారీ స్కూటీని ఢీకొట్టగా స్కూటీపై ప్రయాణిస్తున్న ఏఎన్ఎం సునీత మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల పరిధిలోని మరి ముచ్చాల, లెనిన్ నగర్ మధ్య సిద్దిపేట- జనగాం రహదారిపై చోటుచేసుకుంది. లారీ స్కూటీని ఢీకొట్టడంతో, స్కూటీపై ప్రయాణిస్తున్న ఎర్రోళ్ల సునీత అక్కడికక్కడే మృతిచెందగా భర్త నర్సయ్య, కూతురు కీర్తనకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులది చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందినవారని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.