17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జనహిత ఆధ్వర్యంలో 325వ సారి అన్నదానం

26-03-2025 05:08 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని గ్రామీణ బస్టాండ్ ప్రాంతంలో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో జనహిత సభ్యులు 325వ సారి నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ... అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని తెలిపారు. దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ఉగాది సందర్భంగా 2021, ఏప్రిల్ 13న ప్రారంబించడం జరిగిందని తెలిపారు. దాతల సహకారంతో ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.

325వ సారి దాత జనహిత అన్నపూర్ణ శాశ్వత అన్నదాతలైన జనహిత అన్నపూర్ణ శాశ్వత అన్నదాత శుభం టెక్స్ టైల్స్ అండ్ ఫాషన్స్ యజమానులు నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం చేపట్టారని తెలిపారు. 180 మందికి అన్నదానం చేసినట్లు చెప్పారు. ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతం కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ జనత సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత శుభం గోపి జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు నరేందుల రామకృష్ణ, నిచ్చకోల గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.