16 April, 2026 | 2:57 AM

కరెంట్ షాక్‌తో అన్నదాత మృతి

23-05-2025 12:00 AM

ఆదిలాబాద్, మే 13 (విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో సాం గి గ్రామానికి చెందిన రైతు బోయర్ దాము (50) గురువారం విద్యుత్ షాక్ తో మృతి చెందారు. తన వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని గతంలో పలుమార్లు విద్యు త్ శాఖ అధికారులకు చెప్పిన పట్టించుకోలేదు. దీంతో గత రెండు రోజులుగా గాలి దుమారానికి విద్యుత్ తీగల తెగిపడ్డాయి.

గురువారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన దాము కాలికి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగానే రైతు మృతి చెందారంటూ గ్రామస్తులు ఆందోళన దిగారు. అధికారులు వచ్చేవరకు శవాన్ని తరలించమని భీష్ముం చుకుర్చున్నారు. పోలీసులు కల్పించుకొని రైతు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.