calender_icon.png 23 May, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

22-05-2025 10:28:48 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని పాలచెట్టు సమీపంలోని పంచముఖ హనుమాన్ దేవాలయం రజతోత్సవాల్లో భాగంగా గురువారం హనుమాన్ జయంతి(Hanuman Jayanti) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి(Chinna Jeeyar Swamy) పర్యవేక్షణలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై, అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ప్రత్యేక పూజలు, యజ్ఞాలు యాగాలకు మహా పూర్ణాహుతితో సంపూర్ణం చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణకాంత్ చార్యుల నేతృత్వంలో రజతోత్సవ వేడుకలలో భాగంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి, త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి, 108 అనుభవజ్ఞులైన వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ శ్రీ సీతారాముల పట్టాభిషేకం కల్యాణ మహోత్సవ ఘట్టాలను కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణ వేడుకలను 5 వేలకు పైగా భక్తులు తిలకించారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో యాజ్ఞికులు సముద్రాల శ్రీనివాస చార్యులు, గోవర్ధనగిరి అనంతచార్యులు,  కుమారాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు డింగరి కృష్ణ చైతన్య చార్యులు, శ్రీకాంతా చార్యులు, నవీన్ చార్యులు, నరసింహ చార్యులు, సింగరేణి డైరెక్టర్ ఈ అండ్ ఎం డి సత్యనారాయణ రావు, ఏరియా జిఎం జి దేవేందర్, స్వరూప రాణి దంపతులు, దివంగత కల్వకుంట్ల సురేందర్ రావు కుటుంబ సభ్యులు, పట్టణ సిఐ కే శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ దీక్ష స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

వేడుకల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు..

పట్టణంలోని పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో పంచకుండాత్మక శ్రీరామాయణ మహాయాగ పూర్వక, వివిదేష్టి సహిత శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి వారి రజతోత్సవం కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లిలు పాల్గొని పాల్గొని ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు.  అనంతరం త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజీపీ సీనియర్ నాయకులు డీవీ దీక్షితులు, దేవరనేని సంజీవరావు, పట్టణ అధ్యక్షులు సప్పిడి  నరేష్, మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ లు పాల్గొన్నారు.