అన్నప్రసాదం రుచిగా ఉండాలి
టీటీడీ ఈవో ఆదేశం
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి) : తిరుమల భక్తులకు నాణ్య మైన, రుచికరమైన అన్న ప్రసాదాలను అందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. అన్నప్రసాద విభాగం కార్యక లాపాలను బుధవారం ఆయన సమీక్షించారు. జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం నుంచి పలు వివరాలు సేకరించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కాంప్లెక్స్, వీక్యూసిలోని అక్షయ్ కిచెన్, పీఏసీ2, ఉద్యోగుల క్యాంటీన్, పద్మావతి అతిథి గృహాలను సందర్శించి అన్నప్రసాదం తయారీని పరిశీలించారు. భక్తులకు అందించే మజ్జిగలో నాణ్య త పెంచాలని, వంట స్థలంలో ఆవరణ పరిశుభ్రంగా, పొడిగా ఉంచాలని సూచించారు. ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని పుడ్ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. నిలిపివేసిన పాంచజన్యం వంటశాల పనులను తిరిగి ప్రారంభించాలని సూచించారు.






