18 May, 2026 | 1:57 AM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు కొత్త పాలసీ

20-06-2024 01:00 AM
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
  • ఖమ్మంలో టీయూడబ్ల్యుజే (ఐజేయూ) తృతీయ మహా సభలు

ఖమ్మం, జూన్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలా లు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకువస్తామని సమాచార, పౌర సంబం ధాల, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఖమ్మంలో బుధవారం ప్రారంభమైన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర తృతీ య మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం లో జర్నలిస్టులు కీలక పాత్రను పోషించినా వారి సమస్యలను మాజీ సీఎం కేసీఆర్ పరి ష్కరించలేదన్నారు. హైదరాబాదులో గతం లో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలకు సంబం ధించి కోర్టులో కేసు వల్ల ఆగిపోయాయని, ఏడాది క్రితమే ఆ కేసు క్లియర్ అయినా కూడా గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇవ్వలే దని విమర్శించారు.

ఆ స్థలాలను జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారం పది రోజుల్లోనే దానికి సంబంధించిన జీవోను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేస్తారని ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌లో మిగిలిన జర్నలిస్టులకు, జిల్లాలు, మండలాల్లో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీని తీసుకువస్తున్నట్లు చెప్పారు. గతంలో ఖమ్మంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇచ్చిన జీవో ఆగిపోయిందని తెలిపారు. మరొక స్థలాన్ని చూడాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించామని ఆ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందని మంత్రి వెల్లడించారు.

అక్రిడిటేషన్ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నదని, మరో మూడు నెలల పాటు గడువు పెంచుతు న్నామని తెలిపారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా అందిస్తామని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కోసం ఉన్నటువంటి అన్ని రకాల కమిటీలను త్వరలోనే పునరుద్ధ రిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, ఐజేయూ ప్రతినిధులు నరేందర్‌రెడ్డి, కే.సత్యనారాయణ పాల్గొన్నారు.