calender_icon.png 10 February, 2026 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 70 ఏళ్ల వేడుకలు

09-02-2026 12:36:46 AM

మార్చి 29న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

వరంగల్ (మహబూబాబాద్) ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి 70 ఏళ్లు పూర్తవుతు న్న సందర్భంగా, పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 70వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు పూర్వ వి ద్యార్థుల సంఘం అధ్యక్షులు ఇ .వి. శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ సందర్భంగా పూ ర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని 2026 మార్చి 29వ తేదీ (ఆది వారం) న వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈమేరకు ఆదివారం కళాశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ని ర్వహించి, 70 ఏళ్ల వేడుకల నిర్వహణ, కార్యక్రమ రూపకల్పన, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం తదితర అంశాలపై సభ్యులందరూ విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఇ .వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రాష్ట్రానికి, దేశానికి అనేక మంది ని పుణులు, ఇంజినీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులను అందించిన గౌరవప్రదమైన విద్యాసంస్థగా గుర్తింపు పొందిందన్నారు.

70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. రాబోయే 70వ వా ర్షికోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి, అలాగే కళాశాల మౌలిక సదు పాయాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులందరూ విరివిగా విరాళాలు అందించి సహక రించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వే డుకల సమాచారాన్ని ప్రతి పూర్వ విద్యార్థికి చేరవేసి, అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

70 ఏళ్ల వేడుకలు కేవలం ఉత్సవంగా మాత్రమే కాకుండా, పూర్వ విద్యార్థుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలవాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చే యాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇటీవల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ద్వారా ప్రశంసలు పొందిన వరంగల్ ప్రభు త్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ను పూర్వ విద్యార్థుల సంఘం తరఫున శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రగతికి ప్రిన్సిపాల్ చేస్తున్న సేవలను కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి మేకల అక్షయ్ కుమార్తో పాటు పూర్వ విద్యార్థులు ఎల్లయ్య, ఉమేందర్, శ్రీనివాసులు, బొద్దిరెడ్డి సతీష్ రెడ్డి,  ఇమ్మడి శ్రీనివాస్ రావు, ధర్మ శ్రీనివాస్ రెడ్డి, ఎం.మహేందర్, భిక్షపతి, రాజ్ కుమార్, వసంత్ కుమార్, శశి కుమార్, సాయిరాజ్, రవి, వేణు, కుమార్, శ్రీకాంత్, రమేష్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.