calender_icon.png 10 February, 2026 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ న్యాయ కళాశాల కోసం దీక్షలు చేస్తుంటే ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారా?

09-02-2026 12:35:17 AM

జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర

వెంకటాపురం(నూగూరు), ఫిబ్రవరి 8(విజయక్రాంతి):ఆదివారం నాడు వెంకటాపు రం మండల కేంద్రంలో జిఎస్పి మండల కమిటీ సమీక్ష సమావేశంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెమ్ సాయి దొర మాట్లాడుతూ 5వషెడ్యూల్ ఏరియాలో ఆదివా సుల భూ భాగమైన భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని భద్రాచలం ఐటిడిఏ ఎదురుగా ఆరు రోజుల నుండి దీక్షలు కొనసాగిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే నిమ్మకు నీరెట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

అది ఆదివాసి చట్టాలకు ఆదివాసి జాతికే అవమానంగా ఉన్నదని ఆయన మండిపడ్డారు. భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాల ఏర్పా టు చేయాలని జిఎస్పి 2000 సంవత్సరం నుండి పోరాటం చేస్తుంటే ఏ ఒక్క ఆదివాసి ఎమ్మెల్యే కూడా ఎందుకు మద్దతు పలకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదు, మీరు నిజమైన ఆదివాసి ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో మాట్లాడాలని ఆయన ఘాటుగా విమర్శించారు. 

భూమిపై నీటిపై అడవిపై సర్వహక్కులు ఆదివాసీలకే ఉంటాయని ఐక్యరా జ్యసమితి చెబుతున్నప్పటికీ ఈ నీచమైన రాజకీయ పార్టీల వల్ల ఆదివాసి ఎమ్మెల్యేలు కుంటి పడిపోయారని ఆయన మండిపడ్డారు. ఏ రోజైనా అసెంబ్లీలో ఆదివాసి చట్టాలను అమలు చేయాలని అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు.

రాజకీయ పార్టీల నాయకుల కాళ్ళ కిందనే బ్రతుకుతున్నారా, ఆదివాసి అని చెప్పుకొని ఆదివాసి చట్టాలకే కోట్లు కొ డుతున్నారా, మీ జాతిని కాపాడుకో లేనప్పుడు రాజీనామాలు చేయవలసిందేనని ఆ యన మండిపడ్డారు. ఆదివాసి న్యాయ కళాశాల ఏర్పాటు కోసం ఒక ప్రత్యేకమైన కమిటీ ని నియమించాలని ఆయన డిమాండ్ చేశా రు. ఈ సమావేశంలో అనిల్,సురేష్ బాబు,మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.