15 April, 2026 | 6:29 AM

17 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్స్

09-02-2026 12:37 AM

వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): పదో తరగతి విద్యార్థులకు ఈనెల 17 నుంచి ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈనెల 24 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈనెల 22వ తేదీ మినహా వరుసగా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు. విద్యార్థులందరూ పరీక్షలకు హాజరయ్యేలా డీఈవోలు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫలితాలను ప్రకటించి సమీక్షించుకోవాలని సూచించారు. వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.