calender_icon.png 20 June, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10న నాంపల్లిలో హిందీ ప్రచార సభ హైదరాబాద్ 90వ వార్షికోత్సవం

06-06-2025 12:05:23 AM

హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు

ముషీరాబాద్, జూన్ 5 (విజయ క్రాంతి):  హిందీ ప్రచార సభ హైదరాబాద్ స్థాపించబడి 90 సంవత్సరాలు అయిన సందర్భంగా హిందీ ప్రచార సభ హైదరాబాద్ నాంపల్లిలోని సభా గృహంలో జూన్ 10న ఉద యం10 గంటలకు జాతీయ స్థాయిలో నిర్వహించే హిందీ ప్రచార సభ హైదరాబాద్ 90 వ వార్షికోత్సవ సభ పోస్టర్లను హిందీ ప్రచా ర సభ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఎస్. గైబువల్లి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగినది.

ఈ సందర్భంగా ఎస్.  గైబువల్లి మాట్లాడుతు హిందీ ప్రచార సభ హైదరాబాద్ నాంపల్లి 1935 సంవత్సరంలో స్థాపిం చబడినది హిందీ ప్రచార సభ హైదరాబాద్ వల్ల లక్షల మంది  విద్యార్థులకు హిందీ భా ష నేర్పించడంతో పాటు వేల మందిని ప్రభు త్వ, ప్రైవేటు హిందీ టీచర్లుగా దిద్దిన సంస్థ అని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ, విశిష్ట అతిథులుగా మంత్రులు పొన్నం ప్ర భాకర్, శ్రీధర్‌బాబు హాజరైతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమం హిందీ ప్రొఫెసర్లు, హిందీ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, హిందీ భాషా భిమానులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందీ ప్రచార సభ హైదరాబాద్ స్పెషల్ ఆఫీసర్ శృతి కాంత్ భారతి, వివరణ పత్రిక సహాయక సంపాదకురాలు డాII సుష్మాదేవి, ఆఫీస్ సెక్రటరీ వెంకటేశ్వర్లు,రిజిస్టర్ నాందేవ్, శివలింగం ,మాయ పాండే, వినోద్, శ్రీకాంత్, భానుదాస్ తదితరులు పాల్గొన్నారు.