కోటగుళ్లలో నందీశ్వరుని 3వ వార్షికోత్సవం
17-08-2026 02:05 AM
గణపురం, ఆగస్టు16 (విజయ క్రాంతి): శ్రావణమాస ఉత్సవాలలో భాగంగా కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళలో నేడు సోమవారం నందీశ్వరుని 3వ వార్షికోత్సవాన్ని కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా నందీశ్వరునికి రుద్రాభిషేకం పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోటగుళ్లు పరిరక్షణ కమిటి విజ్ఞప్తి చేసింది.






