17 August, 2026 | 5:00 AM

వాజ్‌పేయి పాలన స్వర్ణయుగం

17-08-2026 02:06 AM
  1. నాటి నిర్ణయాలే దేశాభివృద్ధికి బలమైన పునాది  
  2. టెలికాం సంస్కరణలు, హైవేల నిర్మాణం ఆయన ఘనతే
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  4. వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): ప్రధానిగా వాజ్‌పేయి హయాంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు దేశాభివృద్ధికి బలమైన పునాది వేశాయని, ఆయన పాలన స్వర్ణయుగం గా నిలిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కొనియాడారు. మాజీ ప్రధా ని, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పే యి వర్ధంతి సందర్భంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘ న నివాళులర్పించారు.

ఈ రాంచందర్ రావు దేశానికి వాజ్‌పేయి అందించిన సేవలు, ఆదర్శవంతమైన రాజకీయ ప్రస్థానం, స్ఫూర్తిదాయక మైన ఆయన జీవితాన్ని స్మరించుకున్నారు. వాజ్‌పేయి ఆరేళ్లకు పైగా ప్రధానిగా దేశాన్ని సమర్థవంతంగా నడిపించారని పేర్కొన్నారు. ఆయన హయాంలో జాతీయ రహదారుల నిర్మాణం, టెలికాం రంగంలో విప్లవాత్మక మా ర్పులు తీసుకువచ్చారని, సామాన్యులకు సైతం వంట గ్యాస్ కనెక్షన్లు సులభంగా అందేలా సంస్కరణలు చేశారని పేర్కొన్నారు.

పార్లమెంటులో కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ, నైతిక విలువలకు కట్టుబడి రాజీపడకుండా నిలిచిన మహో న్నత నాయకుడని కొనియాడారు. అధికారం కంటే ప్రజాస్వామ్య విలువలకే వాజ్‌పేయి అగ్రతాంబూలమిచ్చారని, నేటితరం రాజకీయ నా యకులు, యువత వాటి నుంచి స్ఫూర్తి పొం దాల్సిన అవసరం ఉందన్నారు. జీవితాంతం దేశ సేవకే అంకితమైన వాజ్‌పేయి..

నిస్వార్థ దేశభక్తి, అంకితభావాన్ని గుర్తించిన కేంద్ర ప్రభు త్వం ‘భారతరత్న’తో సత్కరించిందని గుర్తు చేశా రు. వాజ్‌పేయి ఆశయాలు, సిద్ధాంతాలు నిరంతరం ప్రతి భారతీయుడి హృదయంలో చిరస్థా యిగా నిలిచి ఉంటాయని, యువతరం ఆయన జీవిత చరిత్రను అధ్యయనం చేసి, ఆ యన చూ పిన మార్గంలో నడవడమే వారికిచ్చే నిజమైన నివాళి అని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

గురువులే యువతకు మార్గదర్శకులు 

నేటి యువతకు సరైన దిశానిర్దేశం, స్పష్టమై న మార్గదర్శకత్వం ఎంతో అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నా రు. ఆధ్యాత్మిక గురువుల బోధనలు, గురుదేవ్ వంటి మహనీయుల ఆశీస్సులు భావితరాలను సన్మార్గంలో నడిపించేందుకు ఎంతో దోహదపడుతాయన్నారు. ఆదివారం హైదరాబాద్ నాం పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జైన్ కమ్యూనిటీ ప్రవచనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లా డారు.

గురుదేవ్ ఇచ్చిన సందేశాన్ని ఆచరణలో పెడుతూ సమాజ సేవ, మానవ సేవకు ప్రతి ఒ క్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్య, వృత్తి పరంగా ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యత ను గుర్తించి ముందుకు సాగాలని కోరారు. సమాజ హితం, ప్రజా సంక్షేమం కోసం నిస్వార్థంగా పని చేసే ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.