శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయ 17వ వార్షికోత్సవం
పాల్గొన్న బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి
సికింద్రాబాద్, జూలై 9 (విజయక్రాంతి): బోయిన్ పల్లి బాపూజీ నగర్లోని శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం 17వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ గౌడ్,బండి రాజు, మారుతీ గౌడ్,మల్లికార్జున్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






