10 July, 2026 | 2:05 AM

పారమిత హెరిటేజ్ పాఠశాలలో నమూనా ఎన్నికలు

10-07-2026 12:00 AM

కొత్తపల్లి, జూలై 9(విజయక్రాంతి): కొత్తపల్లి మండలంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో విద్యా ర్థి మంత్రి మండలిని ఎన్నుకోవడానికి ఎన్నికలను నిర్వహించారు. హెడ్ బా య్, హెడ్ గర్ల్, క్రీడా రంగానికి, క్రమశిక్షణ రంగానికి మరియు సాంస్కృతిక రంగానికి లీడర్లను మరియు డిప్యూటి లీడర్లను ఇ-బ్యాలెట్ విధానంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వారి ఓటుహ క్కును వినియోగించుకొని ఎన్నుకొన్నారు.  ఈ కార్యక్రమంలో విద్యార్థులే బూత్ అధికారులుగా, ఎలక్షన్ అధికారులుగా ప్రిసైడింగ్ అధికారిగా పలు విధులను విద్యార్థులు నిర్వహించడం జరిగింది.

విద్యార్థులందరూ ఆసక్తిగా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.  పాఠశాల అధినేత డా. ఇ. ప్రసాద్ రావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాద్యాయులను వి ద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సమాజంలో ఓటుకు ఉన్న పాధాన్యత ను మ రియు విలువను తెలుపుతూ నేటి బాలలే రేపటి భావిభారత  పౌరులని భవిష్యత్తులో ఈ విద్యార్థులే రాష్ట్ర, దేశ రాజకీయాలలో కీలక బాధ్యతలు నిర్వహించినా ఆశ్చర్య పోనవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో  డైరెక్టర్లు  ప్రసూన, రష్మిత, అనూకర్ రావు, రాకేశ్, వి.యు. యం.ప్రసాద్, వినోద్ రావు, హన్మంతరావు, ప్రధానోపాద్యాయులు గోపీకృష్ణ, కోఆర్డినేటర్లు రబీంద్రపాత్రో, భవాని, నిఖిల మరియు సాంఘీక శాస్త్ర విద్యార్థులు పాల్గొన్నారు.