26 March, 2026 | 12:25 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

మల్లారెడ్డి వర్సిటీలో ఘనంగా వార్షిక వేడుకలు

21-03-2025 01:57 AM

సందడి చేసిన సినీతారలు విజయ్ దేవరకొండ, నితిన్

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): సురారంలోని మల్లారెడ్డి క్రికెట్ గ్రౌండ్‌లో గురువారం మల్లారెడ్డి యూనివర్సిటీ వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు యూనివర్సిటీ వ్యవస్థాపకులు సీహెచ్ మల్లారెడ్డి, చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, మల్లారెడ్డి వర్సిటీ వైస్‌చైర్‌పర్సన్ డాక్టర్ సీహెచ్ ప్రీతి రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సినీతారలు విజయ్ దేవరకొండ, నితిన్ తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఎప్పుడు పాలమ్మిన.. పూలు అమ్మిన అని చెప్పే మల్లారెడ్డి గారు .. దేశం గర్వించదగ్గ మూడు విశ్వవిద్యాలయాలు నెలకొల్పారని కొనియాడారు.

కానీ ఆయనకు సంపద కంటే, విద్యార్థుల ప్రేమ ఎంతో ముఖ్యమైందన్నారు.  ఈ వార్షిక వేడుకలకు రావడం వల్ల తనకు తన కాలేజీ రోజులు గుర్తొచ్చాయని తెలిపారు. ఈ వేడుకలో డాక్టర్ సీహెచ్ ప్రీతి రెడ్డి అద్భుతమైన నృత్యంతో అలరించారు.