మొక్కజొన్న పరిశోధనలపై వార్షిక సమావేశం
ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ డైరెక్టర్ రఘరామిరెడ్డి
హైదరాబాద్, మే 09 (విజయక్రాంతి) : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం నిర్వహిస్తున్నట్లు పరిశోధన సంచాలకులు డా. పి, రఘరామిరెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధన సంస్ధలు సంయుక్తంగా మూడు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ సమావేశాల్లో వివిధ మొక్కజొన్న పరిశోధనా సంస్థల్లో పనిచేసే శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు. మొక్కజొన్నలపై గతేడాది చేపట్టిన పరిశోధనలు, ఫలితాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పరిశోధనలపై ప్రణాళికలు రూపొందించ నున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ నిపుణులు, ఇతనోల్ ఉత్పత్తిపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, వివిధ పరిశ్రమల నిపుణులు, విత్తన ఉత్పత్తి సంస్థలకు ఆయన దిశా నిర్ధేశం చేయనున్నారు.






