శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం.. ఆర్టీసీలో ఉద్యోగం: నర్సంపేట ఆర్‌డీఓ
హైదరాబాద్: వరంగల్ జిల్లా నర్సంపేట బస్ డిపో దగ్గర ఆర్టీసీ సమ్మెలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్(RTC Driver Shankar Goud) కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. తెలంగాణ ప్రభుత్వం బాధితుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.
నర్సంపేట ఆర్‌డీఓ ఉమారాణి(Narsampet RDO Uma Rani) శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళి అర్పించిన అనంతరం పరిహారం ప్రకటించారు. మృతుడి కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తామని అధికారుల హామీ ఇచ్చారు. నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(Congress MLA Donthi Madhava Reddy) మానవత్వం చాటుకున్నారు. శంకర్ గౌడ్ కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.5 లక్షల సాయం చేస్తానని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం, ఎమ్మెల్యే సాయం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.






