24 April, 2026 | 4:06 PM

Breaking News

నాగిరెడ్డిపేట్లో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు   •   విద్యుత్ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి భరోసా   •   అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి   •   కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి   •   దుశ్చర్ల సత్యనారాయణపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి వాకబు   •   ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి   •   మేకల కాపరులపై దాడితో దుశ్చర్లపై ప్రతి దాడి   •   తాండూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎల్లారెడ్డి ఏఎంసి చైర్మన్   •   'అంగ, బంగా, కళింగ'లో బీజేపీ ప్రభుత్వాలు.. TMCకి ఓటమి తప్పదు   •   నడిరోడ్డుపై శంకర్ గౌడ్ మృతదేహంతో బండి సంజయ్ నిరసన   •  

రేపు సాయంత్రం నుంచి వైన్ షాపులు బంద్

10-05-2024 02:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (విజయక్రాంతి) : ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటో న్మెంట్ ఉప ఎన్నికల పోలింగ్ జరగబోతున్న సందర్భంగా నగరంలో రేపు సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు వైన్‌షాపులను బంద్ చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారు లు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కే. శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈనెల 13న సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని వైన్ షాపు యజమానులను ఆదేశించారు.  జూన్ 4న జరుగనున్న ఓట్ల లెక్కింపు రోజున కూడా వైన్ షాప్‌లను మూసివేయనున్నట్లు స్పష్టం చేశారు.