24 April, 2026 | 1:20 PM

నర్సింగ్ విద్యార్థులకు విస్తృత అవకాశాలు

10-05-2024 01:56 AM

టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): నర్సింగ్ విద్యార్థులకు విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. తార్నాకలోని టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో 2023 బ్యాచ్ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల ల్యాంప్ లైటింగ్ కార్యక్రమం గురువారం నిర్వహించగా, ఆయన హాజరై మాట్లాడారు. సుశిక్షుతులైన నర్సులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉందని, నైపుణ్యాలను పెంచుకొని నర్సింగ్ వృత్తిలో రాణించాలని సూచించారు.

ఆర్టీసీ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా అప్‌గ్రేడ్ చేశామని, నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణకాంత్, తార్నాక ఆసుపత్రి సీఎంఓ డాక్టర్ శైలజామూర్తి, డాక్టర్ శ్రీనివాస్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వసుంధర తులసి, వైస్ ప్రిన్సిపాల్ సోని తదితరులు పాల్గొన్నారు.