24 April, 2026 | 3:30 PM

ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

24-04-2026 02:21 PM

సుల్తానాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): వాసవి మాత జయంతి వేడుకల ను అధికారికంగా నిర్వహించేందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో విడుదల చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవనం ఆవరణ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు , మంత్రులకు, రాష్ట్ర  ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత చిత్రపటాల తో ఉన్న ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది,

ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాత జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం మాకు ఎంతో గర్వకారణం అని అన్నారు, ఈ కార్యక్రమం లో వాసవి మాత దేవాలయం చైర్మన్ చకిలం మారుతి, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కొమురవెల్లి రామ్మూర్తి, అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, క్యాషియర్ కొమురవెల్లి (కేబి) శ్రీనివాస్, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, సామాజిక సేవకులు పల్ల కిషన్ , నార్ల శ్రీనివాస్ ,  జిల్లా ఆర్యవైశ్య సంఘం సెక్రెటరీ అల్లంకి లింగమూర్తి, పల్ల అశోక్ , పల్ల సురేష్ , అల్లంకి శ్రీనివాస్, పల్ల అనిల్ , నాగమల్ల ప్రశాంత్ ,   పుల్లూరి రమేష్ , కొమురవెల్లి అంజయ్య , రామిడి రవీందర్, వాసవి మాత దేవాలయం అర్చకులు వల్ల కొండ మఠం మహేష్ తో పాటు ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు , మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని టపాసులు పేల్చి , మిఠాయిలు పంచి , సంబరాలు చేసుకోవడం జరిగింది..