24 April, 2026 | 3:15 PM

డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

24-04-2026 02:14 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఉట్నూర్–ఆసిఫాబాద్ రహదారి పనులకు కాంట్రాక్టర్‌కు రావలసిన బకాయిలు చెల్లించాలని, అసంపూర్తిగా ఉన్న కెరమెరి, లక్మాపూర్ బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. 

ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ను కలిశారు. పాఠశాలలకు సమీపంలోని పిహెచ్సి వైద్యులు వారానికి ఒకసారి పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కెరమెరి మండలం కోటపరం దోలి జంగుబాయి దేవస్థానం కమిటీకి 2024 సంవత్సరానికి సంబంధించిన రూ.10 లక్షల బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.