బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు బీడీ కార్మికుల ర్యాలీ, ధర్నా
- ప్రజావాణిలో డిమాండ్లతో కూడిన వినతి పత్రం
- బిడి కార్మికులు వ్యక్తిగత దరఖాస్తులను అందజేశారు
బోధన్,(విజయక్రాంతి): జూన్ 2 న ఇస్తామంటున్న కొత్త పెన్షన్ల విషయంలో స్పష్టమైన ప్రకటనలు లేక అయోమయానికి గురైతున్న రాష్ట్ర ప్రజలు బి. మల్లేష్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షుడు సోమవారం రోజున ఉదయం బోధన్ పట్టణంలోని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టి యు సిఐ) బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీడీ కార్మికులు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి, ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవో కి డిమాండ్లతో కూడిన వినతి పత్రం తో పాటు బీడీ కార్మికుల పింఛన్లకై వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 2023లో అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి,గెలిపిస్తే మేం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీడీ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కట్ ఆఫ్ డేటును తొలగించి పింఛన్ రానటువంటి కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4వేల రూపాయలు ఇస్తామని, 2016 రూపాయలు వస్తున్నవారికి కానీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గత వారం రోజులుగా రాష్ట్రంలో మంత్రులు జూన్ రెండు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటనలు చేశారు.
కానీ నిన్న గాక మొన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కొత్త పెన్షన్ల ఊసే లేదని వాట్సప్ గ్రూపులలో జిపి లలో మున్సిపాలిటీలలో అప్లై చేసుకోవాలంటూ ప్రచారం చేస్తున్నారని సంబంధిత అధికారులను అడిగితే మాకు పై నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ చెబుతున్నారు. గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీడి కార్మికుల ఆవేశాలకు గురి కాకుండా చూడాలని బి.మల్లేష్ హెచ్చరించారు.






