25 May, 2026 | 4:51 PM

అంబేద్కర్ యువజన సంఘం నాయకులకు ఘన సన్మానం

25-05-2026 04:14 PM

నిర్మల్,(విజయక్రాంతి): సోమవారం రోజు అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ జిల్లా కమిటీ అధ్వర్యంలో మొన్న హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికలలో రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కుంటోల్ల వెంకటస్వామి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఈరోళ్ళ పురుషోత్తంకి శాలువ కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ జిల్లా లోని ఎస్సీ, ఎస్టీ ప్రజల గొంతుకలుగా నిత్యం ప్రజలలో ఉంటూ వారి బాధలని వార్త పత్రికల ద్వారా ప్రభుతానికి తెలియజేస్తున్న వీరికి రాబోవు రోజుల్లో ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు,