16 April, 2026 | 11:38 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నటి కల్పికపై మరో కేసు

15-06-2025 12:28 AM

గచ్చిబౌలి స్టేషన్‌లో నమోదు

శేరిలింగంపల్లి, జూన్ 14: కొన్ని రోజుల క్రితం గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో వివాదానికి కారణమైన నటి కల్పికా గణేశ్‌పై గచ్చిబౌలి పోలీసులు శనివారం మరో కేసు నమోదు చేశా రు. మే 29న ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికీ ప్రిజంక్లబ్ అండ్ కిచెన్ మేనేజింగ్ పార్ట్‌నర్ దీపక్ బజాజ్ జూన్ 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పబ్‌లో రచ్చ చేసిన నటి కల్పిక గణేష్ ఓ వ్యక్తి తో కలిసి ఆ పబ్‌కు వచ్చి సుమారు రూ.2,200 విలువైన ఫుడ్, బేవరేజ్‌లు తీసుకున్నారు. అనంతరం ‘చీజ్‌కేక్‘ అనే డెజర్టును ఉచితం గా ఇవ్వాలంటూ సిబ్బందిని బలవంతపెట్టారు.

గుడ్విల్ గెస్టర్గా బ్రౌనీ ఇవ్వగా ఆమె తిరస్కరించి, సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషించి, దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ దురుసు ప్రవర్తనలో భాగంగా ఆమె ప్లేట్‌ను విసిరేసి ఆస్తి నష్టం కలిగించారని, అం తేకాకుండా ఇన్‌స్టాగ్రాంలో అనుచిత ఆరోపణలు చేశారని జనరల్ మేనేజర్ పోలీసులకు తెలిపారు.