13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

గ్రామ పంచాయతీలకు మరో 387 కోట్లు

13-02-2026 12:34 AM
  1.   15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల
  2. పెండింగ్ నిధులూ ఇవ్వండి
  3. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి 

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజా గా రూ. 387 కోట్లు విడుదల చేసింది. ఇదివరకే మొదటి విడతగా రూ. 259. 36 కోట్లు విడుదల చేసిన కేంద్రం, తాజా విడతతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ. 646.36 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అందించినట్లు  పంచాయతీరాజ్  గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది.

రాష్ర్టంలో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేసి, కేంద్ర ప్రభుత్వం కోరిన అన్నివి ధాల సమాచారం, నిధుల వినియోగ వివరాలను సమర్పించిన అనంతరం ని బంధనలకు అనుగుణంగా ఈ నిధులు విడుదలైనట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివద్ధి, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, గ్రామీణ రహదారుల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు.

అయితే 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు మొత్తం సుమారు రూ. 3,000 కోట్ల వరకు నిధులు రావాల్సిఉండగా, ఇప్పటికి సుమారు రూ. 2,400 కోట్ల వరకు నిధులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.

గ్రామాల సమగ్రాభివృద్ధి, స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం దష్ట్యా పెండింగ్ నిధులను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రా మీణాభివద్ధిశాఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాం తాల అభివృద్ధి వేగవంతం కావాలంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం అ త్యంత అవసరమని, గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని మంత్రి తెలిపారు.