27 July, 2026 | 6:30 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

వేధించి.. వెంటాడి.. చంపి

29-05-2024 12:28 AM

భోపాల్, మే 28: మధ్యప్రదేశ్‌లో మరో దళిత కుటుంబంపై అగ్రవర్ణాల దారుణ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. దళిత కుటుంబంలోని ఆడపిల్లను వేధించి, ఎదిరించిన ఆ కుటుంబంలోని మగవాళ్లను చంపి నా రాష్ట్రంలో అడిగేవాడు లేకుండా పోయా డు. మంగళవారం మరో రెండు హత్యలు జరిగాయి. 

ఎడతెగని వేధింపులు..

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఓ దళిత కుటుంబంలోని బాలిక (15)ను అగ్రకులాలకు చెందిన యువకులు 2019లో నగ్నంగా మార్చి వేధించారు. పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. అయినా ఆ బాలిక ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఆజాద్ ఠాకూర్, విశాల్ ఠాకూర్, పుష్పేంద్ర ఠాకూర్, చోటు రైంక్వర్ అనే యువకులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ దుమారానికి కారణమైంది. ప్రతిపక్ష కాంగ్రె స్, అధికారపక్ష బీజేపీ దుమ్మెత్తిపోసుకున్నాయి. ఎన్నికలు ముగియగానే ఈ కేసును అందరూ మర్చిపోయారు. కానీ, నిందితులు మాత్రం బాధిత కుటుంబంపై వేధింపులు ఆపలేదు. బాధిత యువతికి ఇప్పుడు 20 ఏండ్లు.

కేసు వాపస్ తీసుకోవాలని నిందితులు ఎంత ఒత్తిడి తెచ్చినా దళిత కుటుం బం ఒప్పుకోకపోవటంతో గతేడాది ఆగస్టులో వందలమంది ఆ కుటుంబంపై దాడి చేశారు. బాధితురాలి సోదరుడి (18)ని కొట్టి చంపారు. అతన్ని కాపాడబోయిన బాధితురాలిని, ఆమె తల్లిని కూడా తీవ్రంగా కొట్టారు. ఈ దాడిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. విక్రం ఠాకూర్, విజయ్ ఠాకూర్, ఆజాద్ ఠాకూర్, కోమల్ ఠాకూర్, లాలూఖాన్, ఇస్లామ్ ఖాన్, గోలు సోనీ, నసీఫ్ ఖాన్, వహీద్ ఖాన్‌ను అరెస్టు చేశారు. 

మళ్లీ దాడి..

ఎస్సీ, ఎస్టీ చట్టం చాలా కఠినమైనది కావటంతో నిందితులు రాజీ కోసం బాధిత కుటుంబంపై మళ్లీ ఒత్తిడి మొదలుపెట్టారు. కోర్టు బయట రాజీ చేసుకొందామని పప్పు రజక్ అనే వ్యక్తి ద్వారా బాధితురాలి బంధువుకు కబురు పంపారు. ఆ బంధువు అట్రాసిటీ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నాడు. దీంతో అతన్ని తన సాక్ష్యా న్ని వాపస్ తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అందుకు అతడు అంగీకరించపోవటంతో గత శనివారం నిందితులు మూకుమ్మడిగా దాడి చేయడం తో మరణించాడు. మధ్యవర్తిగా పనిచేసిన పప్పురాజ్‌పై కూడా దాడిచేయటంతో అతని పరిస్థితి సీరియస్‌గా ఉన్నదని పోలీసులు తెలిపారు. ఈ దాడిపై మరో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆషిక్ ఖురేషీ, బబ్లు బేనా, ఇస్రాయెల్ బేనా, ఫహీద్ ఖాన్, తంతు ఖురేషీని అరెస్టు చేశారు.