16 April, 2026 | 2:10 PM

తప్పిన మరో విమాన ప్రమాదం

22-06-2025 12:44 AM

- ఇండిగో విమానంలో ఇంధన కొరత

- సురక్షితంగా బెంగళూరులో ల్యాండ్ అయిన విమానం

బెంగళూరు, జూన్ 21: అహ్మదాబాద్ విమాన ప్రయాణ అనంతరం భారత్‌లో వరుసగా విహంగ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గౌహతి మధ్య సేవ లందించే ఇండిగో 6ఈ 6764 విమానం గురువారం గౌహతి నుంచి బయలుదేరింది.  కొద్ది సేపటి తర్వాత విమానంలో ఇంధనం తక్కువగా ఉందని రాత్రి 8.11 సమయంలో పైలట్ గమనించాడు.

వెంటనే ఏటీసీకి ‘మేడే’ సందేశం పంపగా.. ఏటీసీ సిబ్బంది విమానాన్ని బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ చేయాలని చెప్పారు. దీంతో విమా నం బెంగళూరులో అత్యవసరంగా ల్యాం డింగ్ అయింది. బెంగళూరు విమానాశ్రయంలో ఇంధనం నింపుకున్న అనంతరం విమానం తిరిగి చెన్నైకి బయల్దేరింది. జూన్ 19న ఈఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసిందిది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తు న్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.