పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత
మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్
హుజూర్ నగర్, జూన్ 28 : పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఐదు సంవత్సరముల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
ప్రజా ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న బహుత్తర కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి బూత్లో పోలియో చుక్కలు అందుబాటులో ఉన్నాయని అర్హులైన ఒక్క చిన్నారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ కత్తి సతీష్ కుమార్, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు సులవ నాగలక్ష్మిచందు, దగ్గుపాటి కవితబాబురావు, అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.






