మామునూరు ఎయిర్‌పోర్టుకు మరో రూ.90 కోట్లు
17-10-2025 01:17 AM
విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : వరంగల్‌లో ఉన్న మామునూరు విమానాశ్రయాన్ని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ద్వారా అభివృద్ధి చేయడానికి అవసరమైన భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం అదనంగా రూ.90 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి మొత్తం 280.30 ఎకరాల భూమిని సేకరించడానికి గతంలోనే అనుమతులు మంజూరు చేశారు. 2024 నవంబర్ 17న జారీ చేసిన జీవో 43 ద్వారా భూసేకరణకు రూ.205 కోట్లు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. భూసేకరణ అవార్డును ఖరారు చేయడానికి, నిర్వాసితులకు పరిహారం చెల్లించడానికి రూ.90 కోట్లు మంజూరు చేసింది.






