28 June, 2026 | 3:09 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ధాన్యం కొనండి మహాప్రభో..

17-10-2025 01:17 AM

వలిగొండ, అక్టోబర్ 16 : వరి కోతలు ప్రారంభమై పక్షం రోజులు కావస్తున్న నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ధాన్యం కొనండి మహాప్రభో అని ప్రభుత్వాన్ని అధికారులను వేడుకుంటున్నారు. గత నాలుగు రోజుల క్రితం వలిగొండ మండలంలోని వివిధ గ్రామాలతో పాటు వలిగొండ మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షంతో రైతుల ధాన్యం తడిసిపోయింది.

కాగా పలువురి రైతుల ధాన్యం పూర్తిగా తడవడంతో ధాన్యం మొలకెత్తింది. వలిగొండ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం మొలకెత్తడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు రైతుల పట్ల కనికరించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మొలుకెత్తిన ధాన్యాన్ని చూసి తమ ఆరుగాలం కష్టం నష్టపోయామని మొత్తుకుంటున్నారు.