బీసీల కోసం అట్రాసిటీ నిరోధక చట్టం తేవాలి
కులాన్ని బట్టి న్యాయం మారుతుందా?
టీఆర్పీ నేత తీన్మార్ మల్లన్న ప్రశ్న
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ రక్షణ చట్టం
బిల్లు పెట్టాలి: బీసీ జేఏసీ చైర్మన్ జాజుల
ముషీరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు బీసీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని తేవాలని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని పలువురు బీసీ సంఘా ల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రెడ్డి ప్రభుత్వం బీసీ లు, దళిత కుటుంబాలపై దాడి చేసినవారిని, హత్యా కేసుల్లో దోషులైన తమ రెడ్డి కులస్తులను రక్షిస్తుందని ఆరోపించారు.
సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యకుడు ఎర్ర సత్యనారాయణ నేతృత్వంలో బీసీ సంఘాల నాయకు లు మహాధర్నా నిర్వహించారు. ఈ మహా ధర్నాకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, పలువురు బీసీ సంఘాల నాయకులు హాజరై మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మా ట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ స్పం దన కులాన్ని బట్టి మారుతోందనే భావన బలపడుతోందని అన్నారు. రెడ్డి వర్గానికి చెందిన ఆడబిడ్డకు అన్యాయం జరిగితే 24 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసి వెంటనే న్యాయంచేశారని, కానీ బీసీలకు న్యాయంకావాలంటే మాత్రం ధర్నాలు, పోరాటాలు చేయాలా అని ప్రశ్నించారు. కుమ్మెర ఘటనలో నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
రాష్ట్ర యంత్రాంగం మావోయిస్టు గణపతి వంటి వ్యక్తుల ఆచూకీ తెలుసుకుంటుంది కానీ బీసీ బిడ్డను చంపిన ఘటనలో నిందితులైన రెడ్ల ఆచూకీ తెలియదనడం శోచనీ యమన్నారు. రాబోయే రోజుల్లో బీసీల రక్షణ కోసం అట్రాసిటీ నిరోధక ప్రత్యేక చట్టం అవసరమని, కుమ్మెర ఘటనలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకురావాలని స్ప ష్టం చేశారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీల సమస్యలను పట్టించుకోవడం లేదని మల్లన్న ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రేవంత్‌రెడ్డికి గద్దె దింపుతాం అని హెచ్చరించారు. బీసీలపై జరుగుతున్న అన్యాయాలను ప్రధాన మీడి యా ప్రాధాన్యంగా చూపడంలేదని విమర్శించారు.
బీసీల రాజకీయ, ఆర్థిక, సామా జిక హక్కులకు సంబంధించి ఖచ్చితమైన డేటా అవసరమని పేర్కొంటూ, ప్రభుత్వం వెంటనే కులగణన లెక్కలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీసీల సమస్యలపై రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని మల్లన్న సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో బీసీ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యమని, ఆ ప్రభుత్వంలో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేస్తామని తెలిపారు.
హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి: జాజుల
రాష్ర్టంలో బీసీలపై అగ్రకులాల దాడు లు, హత్యలు, అత్యాచారాలు అధికమవుతున్నాయని, అందులో భాగంగానే కుమ్మెర ఘట న జరిగిందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుం డా ఉండాలంటే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బీసీల అట్రాసిటీ నిరోధక చట్టం తేవాలని, బీసీల రక్షణ కోసం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
కుమ్మెర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యహరిస్తుందని, దాడి జరిగి పది రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు నిందితులను అరెస్టు చేయకపోవడం దారుణమ న్నారు. దోషులకు చట్టబద్ధంగా శిక్షలు పడాలంటే తక్షణమే రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కులం పేరుతో దూషించి దాడులుచేయడం, అత్యాచారాలు. హత్యలు ఎదురు కోవడానికి బీసీ సమాజమంతా ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
బీసీలను అగ్రకులాలు బహిష్కరిస్తే.. బీసీలంతా ఏకమై అగ్రకులాలకు ఓటు వేయ కుండా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బీసీల నేతృత్వంలో బహుజన రాజకీయా లు మేల్కొంటే తప్ప మార్పు రాదని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విజీఆర్ నారగోని, ప్రొఫెసర్ మురళీ మనోహర్, వీ జానయ్య, ఎస్ హరిశంకర్, గుజ్జ కృష్ణ, బర్కా కృష్ణ, వేముల రామకృష్ణ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.




