13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

26-03-2026 01:51 PM

అఖిల భారత రైతుకూలి సంఘం డిమాండ్.

అన్నపురెడ్డిపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని కొండయ్య గూడెం గ్రామంలో అఖిల భారత రైతుకులి సంఘం గ్రామ సభ జరిగినది. ఈ సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని అనంతరం జరిగిన కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ఎస్ కే ఉమర్ మాట్లాడుతూ రైతాంగ సమస్యల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాల కోసం భూమికోసం ఈ దేశ విముక్తి కోసం జరుగుతున్న అనేక రకాల ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా రైతుకూలి సంఘం నిరంతరం రైతుల పక్షాన వ్యవసాయ రంగం సమస్యలపై పోరాటాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మూడు ప్రజావ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలను ఒకటి విద్యుత్ చట్టం, విత్తన చట్టం, ఉపాధి హామీ చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేపట్టిందని విద్యుత్ చట్టం వల్ల స్పాట్ మీటర్లు పెట్టి సెల్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి రైతు కూలీలను ఇబ్బందులు పాలు చేసే విధంగా ఉన్నాయని. విత్తన చట్టాలు రైతులకు వ్యతిరేకమని అవి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చేస్తున్న చట్టాలని ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని దాన్ని వ్యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా అహ్మద్ కార్యదర్శిగా సాయిబాబాను కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.