19 March, 2026 | 4:53 AM

కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు

19-03-2026 01:36 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 18 (విజయ క్రాంతి): ప్రజాపాలన ప్రగతి పతంలో భాగంగా నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో గల ప్రాథమిక పశువైద్య కేంద్రంలో యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల పశు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో గల 12  కుక్కలకు టీకాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా గోపాల్పేట్ గ్రామంలో  పాద-ముక వ్యాధి టీకా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందన్నారు.

పాద-ముఖ కార్యక్రమంలో 65 పశువులకు, 112 ఎద్దులకు/మేతపశువులకు టీకాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి రవికుమార్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, ఉప సర్పంచ్ గులాబ్ హుస్సేన్ శాలువతో సత్కరించి ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, ఉప సర్పంచ్ గులాబ్ హుస్సేన్, సిబ్బంది జయరాజ్,గంగారాం,శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.