12 June, 2026 | 3:53 PM

నిర్మల్ నుండి గోవాకు ప్రత్యేక బస్సు

12-06-2026 03:00 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి గోవా కు ప్రత్యేక సూపర్ లగ్జరి బస్సు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. ఈ బస్సు జూన్ 24 తేదీ నిర్మల్ బస్టాండ్ నుండి బయలుదేరుతున్నట్టు తెలిపారు. నాందేడ్ గురుద్వార్  25 ఉదయం తుల్జాబవాని టెంపుల్ పండరి పూర్ విట్టలెశ్వర్ రుక్మిణి మాత మందిర్ దర్శించుకొని కొలహాపూర్ లక్ష్మి దేవి మందిర్ దర్శించుకొని అదే రోజు రాత్రి బయలుదేరి 26 తేదీ ఉదయం గోవా చేరుకుంటుంది.

26 వ తేదీ రోజు గోవా లోనే బస 27 వ రోజు డే మొత్తం గోవా లోనే ఉండి పోతాము.27 రాత్రి గోవా నుండి రాత్రి బయలుదేరి 28 తేదీ నిర్మల్ చేరుకుంటాము. ఒక రాత్రి రెండు పగలులు గోవా లో గడపవచ్చు. ఛార్జి ఒకరికి 5130/- మాత్రమే భోజన వసతి సౌకర్యం ప్రయాణికులే భరించవలసి ఉంటుంది. ఆసక్తి కలవారు మీ మొబైల్ ద్వారా కాని మన నిర్మల్ బస్టాండ్ లో రిజర్వేషన్ కౌంటర్ లో గాని ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలని  ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు 9959226003, 7382842582 లో సంప్రదించాలని తెలిపారు.