19 March, 2026 | 7:56 AM

శ్రీ హనుమాన్ వ్యాయామశాల అధ్యక్షుడు నార్ల సురేష్‌కు ఘన సన్మానం

19-03-2026 01:35 AM

బాన్సువాడ, మార్చి 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ హనుమాన్ వ్యాయామశాల నూతన అధ్యక్షులుగా నియమితులైనా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తాను బుధవారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట ప్రశాంత్ కుమార్ లు శాలువా,పూలమాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుడే సురేష్ గుప్తా ను అధ్యక్షులుగా నియమితులు కావడం సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో AIAYS నాయకులు కొత్తబాద్ మాజీ సర్పంచ్ బి. సాయిలు, తాడ్కోల్ మాజీ సర్పంచ్ కె. రాజు, తదితరులు పాల్గొన్నారు.