12 June, 2026 | 3:32 PM

పాఠశాల ప్రారంభం

12-06-2026 02:54 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని రాంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్స్ వావ్ స్కూల్ ను నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు కలిసి మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి  ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, గోపు గోపి, పెండం శ్రీనివాస్, లక్కాకుల హరీష్, రాఘవేంద్ర చారి స్థానిక ప్రజాప్రతినిధులు, స్కూల్ యాజమాన్యం మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.