6 March, 2026 | 11:36 PM

సివిల్స్ ఫ‌లితాల్లో అనూజ్ అగ్నిహోత్రికి టాప్ ర్యాంక్‌

06-03-2026 03:23 PM

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission) శుక్రవారం ప్రకటించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష(UPSC CSE Final Result 2026) 2025 ఫలితాల్లో అనూజ్ అగ్నిహోత్రి(Anuj Agnihotri Civil Services topper) అగ్రస్థానంలో నిలిచారు. రాజేశ్వరి సువే ఎం, ఆకాంక్ష్ ధుల్ వరుసగా రెండు, మూడు ర్యాంకులు సాధించారు. మొత్తం 958 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హత సాధించారని, వారిని వివిధ కేంద్ర పౌర సేవలకు నియామకాలకు సిఫార్సు చేశారని కమిషన్ తెలిపింది.

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారులను ఎంపిక చేయడానికి UPSC ప్రతి సంవత్సరం ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంది. సిఫార్సు చేసిన 348 మంది అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని తాత్కాలికంగా ఉంచినట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా 1,087 ఖాళీలను భర్తీ చేయాలని కేంద్రం నివేదించింది.