11-11-2025 12:30:36 AM
బీఆర్‌ఎస్ నగర సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్‌రావు
ముషీరాబాద్, నవంబరు10 (విజయక్రాంతి): జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు బీఆర్‌ఎస్‌కే సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నగర నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో సాధించిన ప్రగతి ఏమీలేదని, ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. 14న వెలువడే ఉప ఎన్నికల ఫలితాలతో బీఆర్‌ఎస్ ఘన విజ యం సాధించి, రాష్ట్రంలో పెను మార్పులు చోటుచేసుకోవడం ఖాయమన్నారు.