నాణ్యమైన విద్యను అందించడంలో అనురాగ్ విశ్వవిద్యాలయం కట్టుబడి ఉంటుంది
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఘట్ కేసర్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి) : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో అనురాగ్ విశ్వవిద్యాలయం కట్టుబడి ఉంటుందని జనగామ ఎమ్మెల్యే, అనురాగ్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అనురాగ్ విశ్వవిద్యాలయం సీనర్జీ2కె 26 వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో 10వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధికి విశ్వవిద్యాల యం కట్టుబాటును ప్రశంసించారు.
వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చనా మంత్రి ఈవేడుకకు అధ్యక్షత వహించి, భవిష్యత్ నాయకు లను తీర్చిదిద్దడంలో విద్యా ప్రావీణ్యం, ఆవిష్కరణల ప్రాముఖ్యతను వివరించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, మెడిసిన్, అగ్రికల్చర్, నర్సింగ్ విభాగాల నుండి అగ్రస్థానాలు సాధించిన విద్యార్థులను వారి విశిష్ట విజయాలకు గాను సత్కరించారు. అధ్యాపకులకు ఎన్ పిటిఈఎల్ ఫ్యాకల్టీ స్టార్ అవార్డులు ప్రదానం చేసి, వారి సేవలను అభినందించారు.
అలాగే క్రీడలు, ఎన్ సి సి, ఎన్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, అధ్యాపకులను గౌరవించారు. ప్రముఖ గాయని మనీషా తన ఉత్సాహభరితమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. ఆమె బాలీవుడ్, టాలీవుడ్ పాటలను ఆలపించి కార్యక్రమానికి ఉత్సాహాన్ని, మధురమైన అనుభూతిని అందించారు. సీఈవో నీలిమ, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్ట్రాటజీ అనురాగ్ పల్లా, డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డాక్టర్ విజయకుమార్,
డీన్ ఎగ్జామ్స్ డాక్టర్ ముత్తారెడ్డి, డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ వి. శ్రీనివాస్ రావు, డీన్ సిఎస్‌ఈ డాక్టర్ విష్ణు మూర్తి, డీన్ అగ్రికల్చర్ డాక్టర్ నారాయణరెడ్డి, డీన్ మెడికల్ డాక్టర్ లక్ష్మి ప్రసన్న, డీన్ ఫార్మసీ డాక్టర్ వసుధ భాక్షి, డీన్ నర్సింగ్ రఫత్ ఫాతిమా, డాక్టర్ విష్ణువందన, ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ మల్లేష్ ఇతర విభాగాధిపతులు, డైరెక్టర్లు అధ్యాపకులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కె. శ్రీనివాస చలపతి, డాక్టర్ తారాసింగ్ ఠాకూర్ నిర్వహించారు.




