7 April, 2026 | 3:03 AM

ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే గ్రామాల ఐక్యత

07-04-2026 12:28 AM

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

షాద్ నగర్,ఏప్రిల్ 6 (విజయక్రాంతి) కొందుర్గ్ మండలం తంగెలపల్లి గ్రామంలోని నందీశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ధ్వజస్థంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవాలయ అభివృద్ధి, గ్రామ ప్రజల సుఖసంతోషాలు కోసం ప్రార్థనలు చేశారు. ప్రజల క్షేమం, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించిన అంజయ్య యాదవ్, దేవాలయ కార్యక్రమాల నిర్వహణకు తన వంతుగా ఆర్థిక సహాయం అందించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్, మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, మాజీ సర్పంచులు కుమ్మరి బాలరాజు, రాజరామేశ్వర్ రెడ్డి, రవి గౌడ్, మాజీ ఎంపీటీసీ శివరాజ్ యాదవ్, నాయకులు లింగం గౌడ్, రవీందర్ గౌడ్, బాలరాజు, విజయ్, యాదయ్య, శేఖర్ గౌడ్, యాదగిరి, రఘు, స్థానిక నాయకులు మాజీ జడ్పీటిసీ తనయుడు రామకృష్ణ, మాజీ ఉప సర్పంచ్ నర్సింలు గౌడ్, దివిటి శ్రీను గారు , చెక్కల శ్రీశైలం,  మాణయ్య తదితరులు, గ్రామస్థులు పాల్గొన్నారు.