l పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీ తో పాటు బీజేపీ నేతలు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని, కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పీసీసీ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ ప్రశ్నించారు. మోదీకి నోటీసులు ఇవ్వకుండా, బీజేపీ అధ్యక్షుడికి నోటీసులు ఇవ్వడమేంటనీ అయన నిలదీశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. మోదీని రక్షించేందు కు ఈసీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విధులు సరిగా నిర్వహించ లేదని అధికారులపై చర్యలు తీసుకున్న ఈసీ మోదీపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నదన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు.