రైతుల ఖాతాలో రూ.1,129 కోట్లు జమ
- 12.38 లక్షల టన్నుల వరిధాన్యం సేకరణ
- రాష్ట్ర పౌరసరపరాల శాఖ వెల్లడి
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): యాసంగి సీజన్‌కు సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 12.38 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. 1.54 లక్షల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి కనీస మద్దతు ధర కింద రూ.1,129.43 కోట్లు జమ చేసినట్లు ఆదివారం పౌరసరపరాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ప్రస్తుతం, 8,575 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపడుతోంది.
ఇందులో 4,455 కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాలు, 3,563 కేంద్రాలను ఇందిరా క్రాం తి పథం, మిగిలిన 557 కేంద్రాలను ఇతర సహాయక సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు 5.07 లక్షల టన్న లు సన్నరకం, 7.31 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం సేకరించారు.
క్షేత్రస్థాయిలో నిల్వలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందు లూ తలెత్తకుండా ముందుగానే నివారించేందుకు, అధికారులు వేగవంతమైన రవా ణా చర్యలను అమలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన వరిని నేరుగా, ఎటువంటి జాప్యం లేకుండా నిర్ణీత మిల్లులకు నిరంతరం తరలిస్తున్నారు. నిజామాబాద్, నల్ల గొండ, కామారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, జగిత్యాల, మెదక్, యాదాద్రి భువ నగిరి, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో వరిసేకరణ వేగంగా జరుగుతోంది.






