23 July, 2026 | 1:37 AM

అదరగొట్టిన ఆన్యారెడ్డి, రవికుమార్

23-07-2026 12:27 AM

జీఎంఆర్ స్పోర్ట్స్ సికింద్రాబాద్ క్లబ్ యూత్ ఓపెన్ రెగట్టా

హైదరాబాద్, జూలై 22 : జీఎంఆర్ స్పోరట్స్ 6వ సికింద్రాబాద్ క్లబ్ యూ త్ ఓపెన్ రెగట్టా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండోరోజు పోటీల్లో సికింద్రాబాద్ క్లబ్‌కు చెందిన ఆన్యారెడ్డి అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆప్టిమి స్ట్ ఫ్లీట్ బాలికల విభాగంలో ఆమె అగ్రస్థానంలో నిలిచింది.  నేతికోపుల సింధు రెండో స్థానంలోనూ, రోషిణి కష్యబ్ మూడో స్థానంలోనూ నిలిచారు. ఆప్టిమిస్ట్ ఫ్లీట్ బాలుర విభాగంలో యువరాజ్ సిరోహి అగ్రస్థానంలోనూ, ఆదిత్య, సా మ్రాట్ తర్వాతి స్థానాల్లోనూ నిలిచారు.

అలాగే ఆప్టిమిస్ట్ మె యిన్ ఫ్లీట్ బాలుర విభాగం లో రవికుమార్ అగ్రస్థానం సాధించగా, మహ్మద్ అఫెది, కొండా సామా న్యు తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ బాలికల విభాగంలో సికింద్రాబాద్ క్లబ్‌కు చెందిన శృంగరి రాయ్ మరోసారి టాప్ ప్లేస్ సాధించింది. షెక్ రమీజా బాను, శృష్టి సింగ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.