23 July, 2026 | 1:35 AM

ఆరంభం అదిరేనా ?

23-07-2026 12:28 AM
  1. నేడు జింబాబ్వేతో తొలి టీ20
  2. వైభవ్‌పైనే అందరి చూపు

హరారే, జూలై 22 : ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస పరాజయాలతో సతమతమైన టీమిండియా ఇప్పుడు జింబాబ్వేతో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ హరారే వేదిక గా గురువారం జరగనుంది. ఈ పర్యటనలో భా రత జట్టు యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. జింబాబ్వేను తక్కువ అంచనా వేయ కుండా పూర్తిస్థాయి ప్రదర్శనతో సిరీస్ లో శుభారంభం చేయాలని భారత్ భావిస్తోంది. బీసీసీఐ గంభీర్‌కు విశ్రాంతినివ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్ ఈ సిరీస్‌కు భారత జట్టు తాత్కా లిక కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఇది లా ఉంటే జింబాబ్వేతో సిరీస్ శ్రేయాస్ అ య్యర్ కెప్టెన్సీకి కీలకంగా మారింది.

తొలి రెండు సిరీస్ లలోనూ సారథిగా నిరాశపరిచిన అయ్యర్ జట్టును ఎలా నడిపిస్తాడనేది చూడాలి. ఈ సిరీస్ లోనూ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి చూపు ఉంది. ఐపీఎల్ లో పరుగుల వరద పారించి 15 ఏళ్లకే జాతీయ జట్టుకు ఎంపికైన వైభవ్ ఇంగ్లాండ్ టూర్‌లో విఫలమయ్యాడు. అయి తే అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన ముద్ర వేసేందుకు జింబాబ్వే టూర్ వైభవ్ కు అ ద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు. బ్యాటింగ్‌లో ఆల్ రౌండర్లు రింకూ సింగ్, శివం దూబే, సూర్యాంశ్ శెడ్గేలపై అంచనాలున్నా యి.

అటు బౌలింలో మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ పేస్ ఎటాక్ ను నడిపించనున్నారు. అలాగే స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్, హర్ష దూబే కీలకం కా నున్నారు. మరోవైపు జింబాబ్వే తమ సొంతగడ్డపై ఎటువంటి ప్రత్యర్థికైనా షాక్ ఇచ్చే సత్తా ఉన్న జట్టుగా చెప్పొచ్చు. గత రికార్డులను చూస్తే భారత్ దే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య 14 టీ20 జరగ్గా భారత్ 11 మ్యాచ్ లలో గెలిచింది. జింబాబ్వే మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది.