calender_icon.png 2 February, 2026 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరైనా శిక్షార్హులే!

02-02-2026 01:30:17 AM

  1. పారిశ్రామిక వేత్తలు, సినీతారల ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు
  2. పీసీసీ మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారు ఎంతంటి వారైనా శిక్షార్హులేనని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదు..గతంలో శిబూసోరెన్, మాయావతి, జయలలిత, లాలూప్రసాద్ యాదవ్, యడ్యూరప్ప లాంటి ముఖ్యమంత్రులు విచారణలు ఎదుర్కొన్నారని ఆయన గుర్తుచేశారు.  బీఆర్‌ఎస్ పాలనలో  పారిశ్రామిక వేత్తలు, సినీతారల ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని, ఫోన్ ట్యాప్‌తో భార్య భర్తల సంసారాల్లో తొంగి చూశారని  మండిపడ్డారు.

కుటుంబాలకు కుటుంబాలను నాశనం చేశారు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్న వేళ బీఆర్‌ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నరాని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి అని, గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అరాచక పాలనపై విచారణలు జరుగుతున్నాయని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌లో ప్రమేయం ఉన్నటువంటి నేతలు విచారణకు హాజరు అవుతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఘోరమైన నేరమని, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్ రావు మాదిరి కేసీఆర్ సిట్ ఎదుట హాజరు అవుతున్నారని, కానీ బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు హడావిడి చేస్తున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.  చట్టం ము ందు అందరూ సమానులేనని మహేశ్‌కు మార్ గౌడ్ పేర్కొన్నారు.