02-02-2026 01:31:48 AM
ఖమ్మం, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జీఎల్‌ఏటీ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి. లిం గానాయక్ ఆధ్వర్యంలో ఏలూరి శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు టీజీఈజేఏసీ సెక్రెట రీ జనరల్ నాయకత్వంలో టీజీవో అధ్యక్ష కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మో దుగు వేలాద్రి సమక్షంలో జీఎల్‌ఏటీ ఖ మ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు.
ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కళావతి, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, ట్రెజరర్ రామారావు, ఉపాధ్యక్షులు స్రవంతి జాహ్నవి ప్రసాద్ ప్రవీణ్ కుమార్ శాంతి ప్రియ, ఐలేశ్వర్, రవి, నరేష్, కుమార్, మాధవి, నజియా, లావణ్య, ఈశ్వరి, లహరి ప్రియ, ఉష, అనూష, మౌనిక, జిల్లాలోని 60 మంది జూనియర్ లెక్చరర్స్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. జీఎల్‌ఏటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. లింగా నాయక్ మాట్లాడుతూ జూనియర్ లెక్చరర్స్ సమస్యల పరిష్కారానికి టీజీ వో సహకరించాలని కోరారు. ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ జీఎల్‌ఏటీ సభ్యుల కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీజీఓ కోశాధికారి సూరంపల్లి రాం బాబు, టీజీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొం డపల్లి శేషు ప్రసాద్, హౌస్ బిల్లింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.