కాసేపట్లో ప్రధాని మోదీ తో సమావేశం కానున్న ఏపీ సీఎమ్ చంద్రబాబు
అమరావతి: రాష్ట్రానికి మరింత ఆర్థక సహాయం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులతో చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం నాడు ప్రధాని, కేంద్ర మంత్రులతో సమావేశమైన ఆయన కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశ రాజధానిలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా, నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలువనున్నారు.
కేంద్ర బడ్జెట్ ను ఆమోదించిన తర్వాత తొలిసారిగా ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్‌ను ఆమోదించిన తర్వాత కేంద్రం రూ. 15000 కోట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ేపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలకు పరిష్కారం కోరడంతో పాటు రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు సత్వరమే నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని ఆయన కోరనున్నారు. ఢిల్లీకి చేరుకున్న నాయుడు ఢిల్లీలో జలశక్తిమంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించారు.






